calender_icon.png 9 July, 2025 | 7:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా ఏబీవీపీ ఆవిర్భావ దినోత్సవం..

09-07-2025 06:05:52 PM

రక్తదానం చేసిన సభ్యులు...

ఆదిలాబాద్ (విజయక్రాంతి): అఖిల భారతీయ విద్యార్థి పరిషత్(Akhil Bharatiya Vidyarthi Parishad) 77వ ఆవిర్భావ దినోత్సవం, జాతీయ విద్యార్థి దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక నేతాజీ చౌక్ లో బుధవారం నిర్వహించిన కార్యక్రమానికి ఏబీవీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు నారి వినోద్ కుమార్ ముఖ్యఅతిథిగా హాజరైయ్యారు. ఈ సందర్భంగా భారత మాత, స్వామి వివేకానంద చిత్ర పటాలకు, నేతాజీ విగ్రహానికి పూలమాలను సమర్పించి, ఏబీవీపీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం నిర్వహించిన రక్తదాన శిబిరంలో పలువురు యువకులు రక్తదానం చేశారు. ఈ సందర్భంగా వినోద్ కుమార్ మాట్లాడుతూ... ప్రపంచంలోనే అతి పెద్ద విద్యార్థి సంఘం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ అని తెలిపారు.

విద్యార్థులలో జాతీయ భావాలు, దేశభక్తి, సామాజిక స్పృహ వంటి విషయాలలో ఏబీవీపీతోనే సాధ్యమన్నారు. జాతీయవాద సిద్ధాంతం కోసం అమరులైన సుమారు 40 మంది కార్యకర్తల పునాదుల మీద ఏర్పడిన ఏబీవీపీ నేడు భారతదేశంలో ప్రతి కళాశాలకు విస్తరించిందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ నిఖిల్, జిల్లా హాస్టల్ కన్వీనర్ మహేష్, శ్రీవర్ధన్, సాయి అరుణ్, శివసాయి, పూర్వ కార్యకర్తలు వెంకట్, నాగేందర్ గౌడ్, నిఖిల్, మనోజ్, రవికాంత్ విద్యార్థులు పాల్గొన్నారు.