calender_icon.png 9 July, 2025 | 9:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏఐటీయూసీ ఆధ్వర్యంలో దేశవ్యాప్త సమ్మె

09-07-2025 05:47:43 PM

బాన్స్వాడ సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా..

డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని సబ్ కలెక్టర్ కు అందజేత..

బాన్సువాడ (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని ఎంసిహెచ్ ఆసుపత్రిలో, సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు దేశవ్యాప్త సమ్మెలో భాగంగా ఏఐటీయూసీ ఆధ్వర్యంలో బుధవారం ధర్నా నిర్వహించారు. దేశవ్యాప్త ఒక్కరోజు సమ్మెలో భాగంగా  డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని సబ్ కలెక్టర్ కిరణ్మయి(Sub-Collector Kiranmayi)కు వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ దుబాస్ రాములు మాట్లాడుతూ... కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కార్మికుల చట్టాలను రద్దు చేసి నాలుగు కోడ్ లుగా విభజించి కార్మిక వర్గానికి తీవ్ర అన్యాయం చేస్తుందన్నారు.

కార్మికులకు ఎనిమిది గంటల పని విధానం అమలు చేయాలని డిమాండ్ చేశారు, హమాలీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని హమాలీలకు వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలన్నారు. రాష్ట్రంలో లేబర్ సంక్షేమ బోర్డును పునరుద్ధరించి, భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరించాన్నారు. ఏఐటియుసి జిల్లా అధ్యక్షులు బాన్సువాడ డివిజన్ ఏఐటీయూసీ కార్యదర్శి డి శంకర్ మాట్లాడుతూ సివిల్ సప్లై హమాలీలు, మధ్యాహ్న భోజన కార్మికులు, హాస్పటల్ కార్మికుల న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కొరకు కార్మికులు ఐక్యంగా ఉండాలని వారు తెలిపారు. బాన్సువాడ హాస్పిటల్ కార్మికులకు మూడు నెలల బకాయి వేతనాలు చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ ప్రతినిధులు కొత్త సాయిలు, భూమయ్య, కమ్మరి రాములు, టి.శ్రీనివాస్, సర్దార్, పి శ్రీనివాస్, గంపల సాయిలు, వల్లెపు గంగాధర్, హాస్పిటల్. కార్మికులు రేణుక, కళ్యాణి, సురేఖ, రజియా బేగం, సుశీల తదితరులు పాల్గొన్నారు.