calender_icon.png 19 September, 2025 | 7:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్రీడలకు పెద్దపీట వేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి

19-09-2025 05:27:17 PM

సుల్తానాబాద్,(విజయక్రాంతి): క్రీడల అభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పెద్దపీట వేశారని , క్రీడల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకొని, క్రీడాకారుల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నారని సుల్తానాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మినుపాల ప్రకాష్ రావు అన్నారు. శుక్రవారం సుల్తానాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో పెద్దపల్లి జిల్లా స్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ క్రీడ పోటీలు  ప్రారంభమయ్యాయి. ఇందులో కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ అండర్ 14, 17 బాలురు, బాలికలు పెద్ద ఎత్తున ఈ పోటీల్లో  పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో  ముఖ్యఅతిథి గా పాల్గొన్న చైర్మన్ ప్రకాష్ రావు మాట్లాడుతూ... గతంలో ఎప్పుడు లేని విధంగా రేవంత్ రెడ్డి సర్కార్ క్రీడలకు గాను ప్రతి హై స్కూల్ కు 25 వేల రూపాయలు అందజేస్తూ క్రీడాకారుల అభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తున్నారు. ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు ఆధ్వర్యం లో  పెద్దపల్లి నియోజకవర్గం లో క్రీడలకు పుట్టినిల్లుగా మారిన సుల్తానాబాద్ లో పలు రకాల క్రీడలు నిర్వహించడం జరుగుతుందన్నారు. సుల్తానాబాద్ స్పోర్ట్స్ క్లబ్ అధ్యక్షుడు ముస్త్యాల రవీందర్ ఆధ్వర్యంలో నిర్వహించిన్నారు.