08-07-2025 12:29:21 AM
సనత్‌నగర్ జూలై 7 (విజయక్రాంతి):- పారిశుధ్యం నిర్వహ ణలో పారిశుద్ద కార్మి కుల పాత్ర ఎంతో కీలకలకమైనదని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తల సాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సోమవారం వెస్ట్ మారేడ్ పల్లి లోని ఎమ్మెల్యే కార్యాలయంలో పారిశుధ్య కార్మికులకు శానిటేషన్ కిట్ లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే ప్రజలు ఆరోగ్యకరమైన వాతావరణం లో జీవించగలరని అన్నారు.
కార్మికులు పారిశుధ్య విధుల నిర్వహణ తో పాటు తమ ఆరోగ్యం పట్ల కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ప్రజలు కూడా చెత్త, వ్యర్ధాలు రోడ్లపై వేయకుండా పారిశుధ్య నిర్వహణ కు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మున్సిపల్ కమిషనర్ పాండు నాయక్, శానిటరీ ఇన్ స్పెక్టర్ ధన గౌడ్, శానిటరీ సిబ్బంది జహంగీర్ తదితరులు ఉన్నారు.