calender_icon.png 14 September, 2025 | 7:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పార్లమెంట్ అనెక్స్ భవనంలో అఖిలపక్ష సమావేశం

21-07-2024 11:40:58 AM

న్యూడిల్లీ: పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలకు ముందు కేంద్ర ప్రభుత్వం ఆదివారం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ నేతృత్వంలో ఈ భేటీ కొనసాగుతోంది.  పార్లమెంట్ హౌస్ అనెక్స్‌లోని మెయిన్ కమిటీ రూమ్‌లో ఉదయం 11 గంటలకు అఖిలపక్ష సమావేశం ప్రారంభం అయింది. ఈ సమావేశంలో పార్లమెంట్ ఉభయ సభలు సజావుగా సాగేందుకు ప్రభుత్వం అన్ని రాజకీయ పార్టీల సహకారం కోరనుంది. సభ ముందుంచే బిల్లుల జాబితాను కేంద్రం విపక్షాలకు అందించనునంది. ఈ సమావేశాల్లోనే ఐదు బిల్లులను ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.  బడ్జెట్ సెషన్ సోమవారం (జూలై 22) ప్రారంభమై ఆగస్టు 12న ముగుస్తుంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ జూలై 23న పార్లమెంట్‌లో కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. మోడీ ప్రభుత్వం మూడోసారి ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్‌ ఇది.