21-07-2024 10:49:02 AM
హైదరాబాద్: ఆషాఢ మాసం బోనాల ఉత్సవాల సందర్బంగా సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దర్శించుకున్నారు. అమ్మవారికి సీఎం రేవంత్ రెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించారు. మహంకాళీ అమ్మవారికి సీఎం పత్యేక పూజలు చేశారు. అర్చకులు, అధికారులు సీఎంకు స్వాగతం పలికారు. ఉజ్జయిని మహాంకాళి బోనాలు ఘనంగా జరుగుతున్నాయి. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు క్యూలెన్లలో వేచి ఉన్నారు. తెల్లవారుజామునుంచే అమ్మవారికి మహా హారతి, కుంకుమ, పుష్ప అర్చనలు నిర్వహించారు. సికింద్రాబాద్ లోని ఆలయంలో ఆధ్మాత్మిక శోభతో వెల్లవిరుస్తోంది. బోనాల సందర్భంగా భక్తులకు ఇబ్బంది కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.