05-12-2025 01:00:04 AM
పట్టుబిగించిన న్యూజిలాండ్
క్రైస్ట్‌చర్చ్ , డిసెంబర్ 4 : వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో న్యూజిలాండ్ పూర్తిగా పట్టు బిగించింది. రెండో ఇన్నింగ్స్‌లో భారీస్కోర్ సాధించింది. ఓపెనర్ టామ్ లాథమ్, స్టార్ బ్యాటర్ రచిన్ రవీంద్ర సెంచరీలతో అదరగొట్టారు. లాథమ్ 145 (12 ఫోర్లు) , రచిన్ రవీంద్ర 176(27 ఫోర్లు,1 సిక్స్) పరుగులు చేశారు. వీరిద్దరూ మూడో వికెట్‌కు 279 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.
తొలి ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీ చేసిన విలియమ్సన్ రెం డో ఇన్నింగ్స్‌లో 9 పరుగులకే ఔటయ్యాడు. దీంతో మూడోరోజు ఆటముగిసే సమయానికి కివీస్ రెండో ఇన్నింగ్స్‌లో 4 వికెట్లకు 417 పరుగులు చేసిం ది. విల్ యంగ్ 21 , బ్రేస్‌వెల్ 6 పరుగులతో క్రీజు లో ఉన్నారు. రోచ్ 2 , షీల్డ్స్ 2 వికెట్లు పడగొట్టారు. తొలి ఇన్నింగ్స్‌లో విండీస్ 167 పరుగులకు ఆలౌటవగా.. కివీస్ 231 పరుగులకు ఆలౌటైంది. ప్రస్తుతం కివీస్ 481 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది.