05-12-2025 12:58:53 AM
సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీ
ముంబైపై కేరళ విజయం
లక్నో, డిసెంబర్ 4 : సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌కు ముందు వికెట్ కీపర్ సంజూ శాంసన్ అదరగొడుతున్నాడు. కేరళ తరుపున సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ఆడుతున్న సంజూ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. ఈ టోర్నీ తొలి మ్యాచ్‌లో 41 బంతుల్లోనే 51 రన్స్ చేసిన సంజూ తర్వాత 15 బంతుల్లోనే 43 పరుగులు బాదాడు. తాజాగా ముంబైతో జరిగిన మ్యాచ్‌లోనూ చెలరేగిపోయాడు. 28 బంతుల్లోనే 8 ఫోర్లు, 1 సిక్సర్‌తో 46 రన్స్ చేశాడు. ప్రస్తుతం భారత జట్టులో ఒక్కో ప్లేస్ కోసం కనీసం ముగ్గురు పోటీ పడుతుండడంతో ఎప్పటికప్పుడు ఫామ్ నిరూపించుకోవాల్సిందే.
దీంతో ప్రస్తుత ఫామ్ సంజూ ఫ్యూచర్‌ను డిసైడ్ చేసే అవకాశముంది. టీ20 టీమ్‌లో జితేశ్ శర్మ నుంచి అతనికి గట్టిపోటీ ఉంది. సౌతాఫ్రికాతో సిరీస్ కోసం ప్రకటించిన జట్టులో సంజూ, జితేశ్ ఇద్దరూ ఎంపికైనా ఎవరికి తుది జట్టులో చోటు దక్కుతుందనేది తెలియడం లేదు. ఇదిలా ఉంటే సంజూ ఇచ్చిన మెరుపు ఆరంభంతో కేరళ 178 పరుగులు చేసింది.
ఛేజింగ్‌లో ముంబై 19.4 ఓవర్లలో 163 పరుగులుకు ఆలౌటైంది. దీంతో కేరళ 15 పరుగుల తేడాతో విజయం సాధించింది. ముంబై జట్టులో ఆయుశ్ మాత్రే, రహానే, సర్ఫరాజ్ , సూర్యకుమార్ యాదవ్, శివబ్ దూబే వంటి స్టార్ ప్లేయర్స్ ఉన్నా ఈ టార్గెట్‌ను అందుకోలేకపోయింది. కేరళ బౌలర్ అసిఫ్ 5 వికెట్లతో ముంబైని దెబ్బకొట్టాడు.