calender_icon.png 5 December, 2025 | 1:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సెంచరీతో ఆదుకున్న రూట్

05-12-2025 01:04:53 AM

  1. ఆరేసిన మిఛెల్ స్టార్క్
  2. యాషెస్ సిరీస్ రెండో టెస్ట్
  3. తొలిరోజు ఇంగ్లాండ్ 325/9

బ్రిస్బేన్, డిసెంబర్ 4 : యాషెస్ సిరీస్ రెండో టెస్ట్ రసవత్తరంగా ప్రారంభమైంది. సొంతగడ్డపై ఈ డే నైట్ టెస్టులో తొలిరోజు పింక్ బాల్‌తో రెచ్చిపోయిన మిఛెల్ స్టార్క్ ఐదు వికెట్లతో ఇంగ్లాండ్‌ను దెబ్బకొట్టాడు. అ యితే ఇంగ్లాండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ అద్భుత సెంచరీతో ఒంటరి పోరాటం చేస్తున్నాడు. మూడో వికెట్ నుంచి కీలక భాగస్వామ్యాలు నెలకొల్పుతూ ఇం గ్లాండ్‌ను ఆదుకున్నాడు. కీలక సమయంలో క్రీజు లోకి వచ్చిన రూట్ చక్కని బ్యా టింగ్‌తో అలరించాడు.

కేవలం రూట్ కారణంగానే తొ లిరోజు ఇంగ్లాండ్ ఆలౌట్ కా కుండా మంచి స్కోర్ చేయగలిగింది. రూట్ ఆసీస్ గడ్డపై తొలి టెస్ట్ సెంచ రీ సాధించాడు. దీని కోసం గత 12 ఏళ్లు గా ప్రయత్నిస్తున్న రూట్ ఎట్టకే లకు తన కలను నెరవేర్చుకున్నాడు. టెస్టుల్లో రూట్‌కు ఇది 40వ సెంచ రీ ఓవరాల్‌గా అంతర్జాతీయ కెరీర్‌లో 59వ శతకం. 2025లో ఇప్పటికే అతడు 4 శతకాలు బాదాడు.