calender_icon.png 7 October, 2025 | 8:10 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోలంపల్లి సర్పంచి స్థానానికి ఎస్సీ రిజర్వేషన్ కల్పించాలి

07-10-2025 06:23:36 PM

తిమ్మాపూర్ (విజయక్రాంతి): తిమ్మాపూర్ మండలం పోలంపల్లి గ్రామ సర్పంచి స్థానాన్ని ఎస్సీ రిజర్వుడ్ గా చేయాలని సిపిఐ మండల కార్యదర్శి బోయిన తిరుపతి ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. గ్రామ పంచాయతీ వ్యవస్థ అమలులోకి వచ్చినప్పటి నుండి పోలంపల్లి గ్రామానికి మాత్రం ఒక్కసారి కూడా ఎస్సీ రిజర్వేషన్ కాలేదని పేర్కొన్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం పోలంపల్లి మొత్తం గ్రామ ఓటర్లు 2529 కాగా అందులో ఎస్సీ 290 జనాభా ఉన్నారని, ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకొని పోలంపల్లి గ్రామ సర్పంచ్ స్థానాన్ని ఎస్సీ రిజర్వుడుగా ప్రకటించి న్యాయం చేయాలని మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ కోరారు.