calender_icon.png 7 October, 2025 | 8:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా వాల్మీకి జయంతి వేడుకలు

07-10-2025 06:17:32 PM

పాల్గొన్న జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్..

జగిత్యాల అర్బన్ (విజయక్రాంతి): ప్రపంచానికి ధర్మం, న్యాయం, సత్యం, సేవా మార్గాలను చాటిన శ్రీ రామాయణ మహాకావ్య రచయిత, ఆదికవి వాల్మీకి మహర్షి జయంతి సందర్భంగా జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ ఆ మహనీయుని చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఇతిహాస రామాయణ మహాకావ్యాన్ని గ్రంథం రూపంలో మానవాళికి అందించిన మహనీయుడు మహర్షి వాల్మీకి అని అన్నారు. అన్నదమ్ముల బంధాన్ని, ఇచ్చిన మాటకు కట్టుబడే విధానం, గురు భక్తి లాంటి ఆచరనీయమైన పద్ధతులను రామాయణం ద్వారా రచించారని గుర్తు చేశారు.

వాల్మీకి జయంతి సందర్భంగా మనకు జీవిత పాఠాలను నేర్పిన రామాయణాన్ని గుర్తు చేసుకోవాలని పేర్కొన్నారు. వాల్మీకి రచించిన రామాయణం, మంచి మీద చెడు విజయం సాధిస్తుందన్న సందేశాన్ని అందిస్తుందని అన్నారు. రామాయణం కేవలం ఒక కథ మాత్రమే కాదు, ధర్మం, నీతి, స్నేహం, కుటుంబ విలువలను మనకు నేర్పే ఒక అద్భుత పాఠంలా ఉప‌యోగ‌ప‌డుతుందని తెలిపారు. ప్రతియేట అక్టోబర్ 7న మహర్షి వాల్మీకి జయంతిని రాష్ట్ర పండుగగా గుర్తిస్తూ ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లు బిఎస్ లత, బి. రాజా గౌడ్, జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారిణి సునీత, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి రఘువరన్, డిపివో మదన్ మోహన్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.