07-10-2025 06:21:19 PM
సుల్తానాబాద్ (విజయక్రాంతి): సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలోని పూసాల శంభు లింగేశ్వర స్వామి దేవాలయంలో గల అభయాంజనేయ స్వామి విగ్రహానికి లక్ష రూపాయల విలువగల వెండి కిరీటం, పంచలోహాలతో తయారుచేసిన మకర తోరణంను పెద్దపెల్లి జిల్లా ఐఎన్టీయూసీ వైస్ ప్రెసిడెంట్ కాంగ్రెస్ నాయకులు నీరటి శంకర్ అందజేశారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారికి అభిషేకం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక, మాజీ ప్రజా ప్రతినిధులు పాల్గొని పలువురు మాట్లాడుతూ పరమశివుడు, అభయాంజనేయ స్వామిల ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని, కష్టాలు తొలగి రైతులు అభివృద్ధి బాటలో నడవాలని కోరారు. భక్తిశ్రద్ధలతో పూజిస్తే, ఎంతటి అసాధ్యమైన పని అయినప్పటికీ, సుసాధ్యం అవుతుందన్నారు. అలాగే దేవాలయాలకు సహాయం చేసేటప్పుడు కులమతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా, దేవాలయాల అభివృద్ధికి తోడ్పడాలన్నారు. అనంతరం ఈ కార్యక్రమానికి హాజరైన ప్రజా ప్రతినిధులందరికీ శాలువాలతో ఘనంగా సన్మానం చేశారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు వేగోళం అబ్బయ్య గౌడ్, శంభులింగేశ్వర స్వామి దేవాలయ కమిటీ చైర్మన్ శంకర్ గౌడ్, లక్ష్మీనారాయణ స్వామి దేవాలయ కమిటీ చైర్మన్ పురం హరికిషన్ రావు, శంభు లింగేశ్వర స్వామి దేవాలయ కమిటీ డైరెక్టర్లు కనుకుంట్ల ప్రమీల శ్రీనివాస్, పెగడ శ్యామ్, పిట్టల రమేష్, జూలూరి శ్రీనివాస్, లక్ష్మీనారాయణ స్వామి దేవాలయ కమిటీ డైరెక్టర్ చొప్పరి సుమన్,మాజీ పద్నాలుగవ వార్డు కౌన్సిలర్ గుర్రాల శ్రీనివాస్ మత్స్యశాఖ పారిశ్రామిక సహకార సంఘం మాజీ అధ్యక్షులు ఉస్తేం రవి, పురం ప్రేమ్ చందర్ రావు, మాజీ ఎంపీటీసీ కంకణాల ఆశాలు, మేకల రాజయ్య, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సాయిరి, మహేందర్, పదమూడవ వార్డు ఇంచార్జ్ కాంగ్రెస్ నాయకులు సిద్ధ తిరుపతి, ఓదెల మల్లికార్జున స్వామి దేవాలయం కమిటీ డైరెక్టర్ సామల యమునా హరికృష్ణ ,పురం రమణ, బిజెపి నాయకులు వేగోళం శ్రీనివాస్ పూసాల సాంబమూర్తి, తమ్మనవేణి సతీష్, తిరుపతి రెడ్డి, వలస నీలయ్య, ఆగండ్ల శంకర్, నాగమల్ల ప్రశాంత్, చొప్పరి రాజు, పూసాల అంజయ్య, వేగోళం మధుకర్, పూసాల రాజ్ కుమార్ నీరటి శంకర్ కుటుంబ సభ్యులు వివిధ పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రజా ప్రతినిధులకు, నాయకులకు ప్రతి ఒక్కరికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.