13-09-2025 03:00:49 AM
గ్రూప్-2 మూడో విడత తేదీలను ప్రకటించిన టీజీపీఎస్సీ
హైదరాబాద్, సెప్టెంబర్ 12 (విజయక్రాంతి) : గ్రూప్-2 పోస్టులకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ మూడో విడత తేదీలను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీజీపీఎస్సీ) ప్రకటిచింది. సెప్టెంబర్ 13న(శనివారం) ఉదయం 10ః30 గంటల నుంచి హైదరాబాద్ నాంపల్లి పబ్లిక్ గార్డెన్‌లోని సురవరం ప్రతాప్‌రెడ్డి యూనివర్సిటీలో ధ్రువీకరణ పత్రాల పరిశీలన జరుగుతుందని కమిషన్ తెలిపింది. ధ్రువీకరణ పత్రాల పరిశీలనకు హాజరయ్యాక సమర్పించాల్సిన పత్రాలు ఇంకా ఏమైనా పెండింగ్‌లో ఉంటే వాటిని సెప్టెంబర్ 15న ఇవ్వాలని పేర్కొంది. మొత్తం 783 పోస్టులకు గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. జాబితాను https://www.tgpsc.gov.in వెబ్‌సైట్‌లో ఉంచినట్టు టీజీపీఎస్సీ పేర్కొంది.