calender_icon.png 24 July, 2025 | 6:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీజీహెచ్‌ఎస్ హాస్పిటల్ సూపరింటెండెంట్‌ను సస్పెండ్ చేయాలి

23-07-2025 01:29:56 AM

తెలంగాణ పెన్షనర్స్, రిటైర్డ్ వర్కర్స్ అసోసియేషన్

హైదరాబాద్, జూలై 22 (విజయక్రాంతి): బేగంపేట సీజీహెచ్‌ఎస్ హా స్పిటల్ సూపరింటెండెంట్‌ను వెంట నే సస్పెండ్ చేయాలని తెలంగాణ ఆల్ పెన్షనర్స్, రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. పెన్ష నర్ల పట్ల ఆయన వ్యవహరిస్తున్న తీ రును వ్యతిరేకిస్తూ మంగళవారం ఆ సుపత్రి ఆవరణలో ధర్నా నిర్వహించినట్లు సంఘం నేతలు ఒక ప్రకటన లో తెలిపారు.

ధర్నాలో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కృష్ణమూర్తి మాట్లాడుతూ పెన్షనర్ల పట్ల సూపరింటెండెంట్ అసహనంగా వ్యవహ రిస్తున్నారన్నారు. ధర్నాలో ఎంఎన్ రెడ్డి, ప్రభాకర్, సోమయ్య, కృష్ణమోహన్ తదితరులు పాల్గొన్నారు.