23-07-2025 01:30:46 AM
మల్కాజిగిరి, జులై 22(విజయక్రాంతి) : మంగళవారం నేరెడ్‌మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జువెలరీ షాప్ ఓనర్లతో సమావేశం నిర్వహించారు నేరెడ్‌మెట్ సి.ఐ సందీప్, ఎస్.ఐ సైదులు. ఈ సమావేశంలో ఇటీవల సూర్యాపేటలో జరిగిన జ్యూవెలరీ షాప్ దొంగతనం ఘటనను ప్రస్తావిస్తూ, అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తీసుకోవలసిన భద్రతా జాగ్రత్తలపై చేర్చించారు.
షాప్ ఓనర్లకు సీసీ కెమెరాలు, అలా రంలు, సెక్యూరిటీ సిబ్బం ది మరియు రాత్రి భద్రతకు సంబంధించి పలు సూచనలు ఇచ్చారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు సూచించారు.