calender_icon.png 19 July, 2025 | 5:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోడ్ల నిర్మాణాలకు అటవీ భూమిని సేకరించాలి

19-07-2025 01:50:56 AM

  1. నష్టపరిహారం విషయంలో మానవతా దృక్పథంతో వ్యవహరించాలి
  2. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు

హైదరాబాద్, జూలై 18 (విజయక్రాంతి): రోడ్ల నిర్మాణానికి అవసర మైన అటవీ భూమి, అటవేతర స్థలా ల భూసేకరణ త్వరితగతిన పూర్తి చేయాలని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఆదేశించారు. బాచుపల్లి--గండిమైసమ్మ వరకు ఆరు వరుసల రోడ్డు, బహుదూర్‌పల్లి నుంచి దూలపల్లి మీదుగా కొంపల్లి వరకు సాగే రహదారి నిర్మాణాలకు అటవీ భూమి బదలాయింపుపై రంగారెడ్డి జిల్లా ఇన్‌చార్జి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు శుక్రవారం సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.

ఈ సమావేశంలో అటవీశాఖ చీఫ్ ప్రిన్సిపల్ కన్సర్వేటర్ సువర్ణ, హెచ్‌ఎండీఎ కమిషనర్ సర్ఫరాజ్ నవాజ్, జీహెచ్‌ఎంసీ అదనపు కమిషనర్, కొంపల్లి మున్సిపల్ కమిషనర్, మేడ్చల్ అదనపు కలెక్టర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సం దర్భంగా మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడు తూ.. సెప్టెంబర్ మొదటి వారంలో ఈ పనులకు శంకుస్థాపన జరిగేలా యుద్ధ ప్రాతి పదికన పనులన్నీ పూర్తి చేయాలని చెప్పారు.

అటవీ శాఖకు చెందిన 19 ఎకరాల భూమి అప్పగింతకు సంబంధించి మొదటి దశ ఫార్మాటిలిటీలన్నీ గడువులోగా అయ్యేలా చూడాలని ఆదేశించారు. స్థానికులకు చెంది న భూముల సేకరణ, నష్టపరిహారం చెల్లింపులో మానవతా దృక్పథంతో వ్యవహరిం చాలని ఆయన సూచించారు. భూసేకరణకు పరిహారంగా ఇచ్చే నిధులను సిద్ధం చేసుకోవాలని తెలిపారు. ఈ రహదారుల నిర్మాణం పూర్తయితే 8 శాసన నియోజకవర్గాల పరిధిలోని ప్రజలకు ప్రయోజనం కలుగుతుం దన్నారు.

బహదూర్ పల్లి నుంచి కొంపల్లి రోడ్డులో అటవీ భూమి బదలాయింపునకు సంబంధించి స్టేజ్--1 ప్రక్రియ పూర్తయిందని ఫారెస్ట్ అధికారులు శ్రీధర్‌బాబుకు వివరించారు. బాచుపల్లి గండిమైసమ్మ రోడ్డు నిర్మాణానికి అవసరమైన అటవీభూ మి బదలాయింపు పనులు కూడా త్వరలోనే పూర్తవుతాయని తెలిపారు. సుభాష్‌నగర్ పైపులైన్, సెయింట్ యాన్స్ స్కూల్ రోడ్డు నిర్మాణం పనులను కూడా పూర్తి చేయాలన్నారు.