calender_icon.png 11 September, 2025 | 3:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సాయుధ పోరాట స్ఫూర్తికి చాకలి ఐలమ్మ నిదర్శనం

11-09-2025 12:46:26 AM

నల్లగొండ టౌన్, సెప్టెంబర్ 10 (విజయక్రాంతి) : తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తికి చాకలి ఐలమ్మ నిదర్శనమని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి  పేర్కొన్నారు. తెలంగాణ పోరాట యోధురాలు, వీరవనిత చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా నల్గొండ పట్టణంలోని సాగర్ రోడ్ లో గల రజక భవనం ఎదుట  చాకలి ఐలమ్మ విగ్రహానికి బుధవారం  పూలమాలలు వేసి నివాళులర్పించారు.   

మిర్యాల గూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, నల్గొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, మాజీ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్,సట్టు శంకర్, పలువురు రజక సంఘం నేతలు పాల్గొన్నారు.

ఐలమ్మ పోరాట స్ఫూర్తి ఆదర్శం 

యాదాద్రి భువనగిరి సెప్టెంబర్ 10 ( విజయక్రాంతి): తెలంగాణ సాయుధ పోరా ట యోధురాలు, వీరనారి చాకలి ఐలమ్మ పోరాట స్పూర్తి అందరికీ ఆదర్శం అని యా దాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంత రావు అన్నారు. బుధవారం చాకలి ఐలమ్మ వర్ధంతిని పురస్కరించుకుని... వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ సమావేశం మందిరంలో వర్ధంతి కార్యక్రమం లోకలెక్టర్ హనుమంత రావు, రెవిన్యూ అదనపు కలెక్టర్ వీరా రెడ్డి తో కలిసి వివిధ శాఖల అధికారులు, వివిధ కుల సంఘాల ప్రతినిధులు చాకలి ఐలమ్మ చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా  కలెక్టర్ మాట్లాడుతూ... భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం జరిగిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి స్ఫూర్తినిచ్చిన చాకలి ఐలమ్మ  సేవలు మరువలేనివి అని అన్నారు. చౌటుప్పల్ రెవెన్యూ డివిజనల్ అధికారి శేఖర్ రెడ్డి, వెనుకబడిన తరగతుల జిల్లా అధికారి సాహితీ, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి నాగిరెడ్డి,వివిధ కుల సంఘాల నాయకులు, కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

భావితరాలకు స్ఫూర్తి చాకలి ఐలమ్మ 

సంస్థాన్ నారాయణపూర్,సెప్టెంబర్ 10 (విజయక్రాంతి): తొలి భూ పోరాటానికి నాంది పలికిన విప్లవ నిప్పుకణిక చాకలి ఐలమ్మ అని కాంగ్రెస్ పార్టీ మండల నాయ కులు ఉప్పల లింగస్వామి అన్నారు. తెలం గాణ సాయుధ రైతాంగ పోరాటంలో కీలక పాత్ర పోషించిన చాకలి ఐలమ్మ వర్ధంతి సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలోని వెంకటేశ్వర సహకార సంఘం సంఘ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి ఏపూరి సతీష్, పిఎసిఎస్ డైరెక్టర్ కృష్ణ, రాచకొండ రమేష్‌బాబు, రజక సంఘం మాజీ అధ్యక్షులు ఉప్పల రాజయ్య, ఉప్పల ముత్యాలు, ఏపూరి శివయ్య, చిలక రాజు సత్తయ్య, ఏపూరి నరసింహ, ఉప్పల అద్విక్, అన్విక్ తదితరులు పాల్గొన్నారు.