24-12-2025 01:46:13 AM
వేములవాడ, డిసెంబర్ 23(విజయ క్రాంతి):వేములవాడ నియోజకవర్గంలోని ఆటో డ్రైవర్లకు భరోసాగా నిలుస్తూ చల్మెడ ఆరోగ్య భీమా కార్యక్రమాన్ని నిర్వహించారు. బీఆర్‌ఎస్ పార్టీ వేములవాడ నియోజకవర్గం ఇంచార్జి, చల్మెడ వైద్య విజ్ఞాన సంస్థ చైర్మన్ చల్మెడ లక్ష్మీనరసింహారావు మంగళవారం ఆటో డ్రైవర్లకు ఆరోగ్య భీమా కార్డులను స్వయంగా అందజేశారు. కోనరావు పేట,రుద్రంగి, చందుర్తి,వేములవాడ అర్బన్, వేములవాడ రూరల్ మండలాలకు చెందిన ఆటో డ్రైవర్లకు పట్టణంలోని శ్రీనివాస కళ్యాణ మండపంలో ఆత్మీయ భరోసా కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా చల్మెడ లక్ష్మీనరసింహారావు మాట్లాడుతూ ఆటో డ్రైవర్ అంటే వి శ్వాసానికి, నిజాయితీకి ప్రతీక అని, వారి ఆరోగ్య భద్రత కోసమే ఈ భీమా అందిస్తున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా గౌరవ ఆటో యూనియన్ అధ్యక్షులు బొల్లి రామ్మోహన్, జిల్లా అధ్యక్షులు ఆలె శ్రీనివాస్, బీఆర్టీయూ అధ్యక్షులు వెంగళ శ్రీనివాస్,సీనియర్ నేత ఏనుగు మనోహర్ రెడ్డి, పట్టణ ప్రధాన కార్యదర్శి క్రాంతి కుమార్, రామతీర్థపు రాజు, నిమ్మశెట్టి విజయ్, మా రం కుమార్, సిరిగిరి చందు, నరాల శేఖర్, జోగిని శంకర్, మండల అధ్యక్షులు గోస్కుల రవి, మల్యాల దేవయ్య, నాయకులు నీలం శేఖర్, కొండ కనకయ్య, తదితరులు పాల్గొన్నారు.