24-09-2025 12:56:26 AM
దర్శకుడు సందీప్ రెడ్డి వంగ తన సొంత నిర్మాణ సంస్థ భద్రకాళి పిక్చర్స్‌లో ఓ సినిమా రూపొందించనున్న సంగతి తెలిసిందే. దీనికి వచ్చే నెల ఖరారైంది. తాను తొలిసారి నిర్మాతగా వ్యవహరి స్తున్న ఈ చిత్రానికి రామ్ గోపాల్ వర్మ శిష్యుడు వేణును దర్శకుడు కాగా, ఇందులో ‘మేం ఫేమస్’ ఫేమ్ సుమంత్ ప్రభాస్ హీరోగా నటించనున్నాడు. తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో యూత్ ఫుల్ కంటెంట్‌తో రానుంది.
అధికారిక ప్రకటన త్వరలోనే రానున్న ఈ క్రేజీ ప్రాజెక్టుపై అంతకన్నా ముందే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. తాజాగా అందుతున్న సమాచా రం ప్రకారం ఈ సినిమాలో హీరోయిన్ ఎంపిక కూడా పూర్తయ్యింది. ‘మ్యాడ్’ బ్యూటీ అనంతిక సనీల్‌కుమార్‌ను ఈ సినిమాలోకి తీసుకున్నారట. ఇటీవల దర్శకుడు ఫణీంద్ర నర్సెట్టి రూపొందించిన ‘8 వసంతాలు’తో ప్రేక్షకుల ముందుకొచ్చిన అనంతిక..
ఈ సినిమాలో అందంతో మెస్మరైజ్ చేయటమే కాకుండా యాక్షన్ సన్నివేశా ల్లోనూ సత్తా చాటింది. ఇప్పుడు సంచలన దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా సినిమాలో హీరోయిన్‌గా ఎంపిక కావటం పట్ల అంద రూ అనంతిక కెరీర్‌కు గొప్ప మలుపుగా భావిస్తున్నారు.