22-09-2025 12:00:00 AM
భీమదేవరపల్లి, సెప్టెంబర్ 21 (విజయక్రాంతి): వీరభద్ర స్వామి దేవస్థానం కొత్తకొండ నందు లోకకళ్యాణార్థం ఆదివారం భాద్రపద అమావాస్య నందు అమ్మవారికి చండీ హోమం ఘనంగా నిర్వహించారుఈ హోమం వలన విశేష కార్యసిద్ధి, సకల చరాచర జగత్తు సృష్టికి స్థితి లయకు మూల కారణమైన జగన్మాతను ఆరాధించడం అనాదిగా వస్తున్నది.
ఈ కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా ఆర్థిక సమస్యలు ఆరోగ్య సమస్యలు తొందరగా తొలుగు తొలుగుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈ కార్యక్రమంలో ఈఓ కిషన్ రావు, ఆలయ ఉప ప్రధాన అర్చకులు కంచనపల్లి రాజయ్య, ముఖ్య అర్చకులు మొగిలిపాలెం రాంబాబు, గుడ్ల శ్రీకాంత్ అర్చకులు సందీప్ శివకుమార్ శరత్చంద్ర శ్రావణ్, శశాంక్ పాల్గొన్నారు.చండీ హోమం అనంతరం దేవాలయంలో చిందు యక్ష గాన కార్యక్రమం నిర్వహించడం జరిగినది.