22-10-2025 05:39:31 PM
ఘట్ కేసర్ (విజయక్రాంతి): ఘట్ కేసర్ నూతన తహసీల్దార్ గా భీమర్తి చంద్రశేఖర్ బుధవారం బాధ్యతలు చేపట్టారు. కలెక్టరేట్ కార్యాలయంలో డి సెక్షన్ లో సూపరింటెండెంట్ గా విధులు నిర్వహిస్తున్న చంద్రశేఖర్ ను డిప్యూటేషన్ పై బదిలీ చేయగా ఘట్ కేసర్ తహసీల్దార్ గా నియమితులయ్యారు. ఇక్కడ తహసీల్దార్ గా విధులు నిర్వహిస్తున్న రజని బదిలీపై కలెక్టరేట్ కార్యాలయంలోని ఈ సెక్షన్ కు వెళ్లారు.