22-10-2025 05:44:50 PM
నిర్మల్ (విజయక్రాంతి): మంజులాపూర్ ఉన్నత పాఠశాలలో ఈ రోజు YRG CARE సంస్థ ఆధ్వర్యంలో ఎయిడ్స్ రహిత ప్రపంచంపై పాఠశాల విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఇందులో HIV ఎయిడ్స్, TB, STIపై వివరించారు. ఎయిడ్స్ కు మందు లేదు కేవలం నివారణ మాత్రమే.. HIV వచ్చినవారు ఎవరూ కూడా అధైర్యపడకూడదు. HIV రోగుల పట్ల వివక్షత చూపరాదు. HIV పట్ల ప్రజలకు అపోహలు, అనుమానాలు ఉండరాదు. ఏమైనా వివరాలకు ఎయిడ్స్ Help line నంబర్ 1097 టోల్ ఫ్రీ నెంబర్ కు కాల్ చేయగలరు. ఈ కార్యక్రమంలో సూపర్ వైజర్ శశిమాల, CLW శశికళ, గీత ఇంచార్జీ ప్రధానోపాధ్యాయులు సంతోష్ ఉపాధ్యాయులు రాజేందర్, చట్ల శ్రీనివాస్, సురేందర్, మసియుద్దిన్, సత్తయ్య, ఆశా కిరణ్, విద్యా రాణి, సునీత, ముత్తన్న పాల్గొన్నారు.