calender_icon.png 14 May, 2025 | 1:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిజాయితీ చాటుకున్న ఆర్టీసీ డ్రైవర్

13-05-2025 08:05:45 PM

నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ డిపోకు చెందిన ఆర్టీసీ డ్రైవర్ సుమన్ తన నిజాయితీని చాటుకున్నారు. సోమవారం సాయంత్రం నిర్మల్ డిపోకు చెందిన లగ్జరీ బస్సు ఒంగోలు వెళ్తుండగా వరంగల్ నుంచి విజయవాడకు వెళుతున్న ఓ ప్రయాణికుడు బస్సులోని బ్యాగు మర్చిపోయినట్టు తెలిపారు. రెండవ డ్రైవర్ సుమన్ టికెట్లు ఇస్తుండగా బ్యాగు కనిపించడంతో అందులో విలువైన డాక్యుమెంట్లు సర్వీస్ బుక్కు ఉండడంతో ఆయనకు ఫోన్ చేసి తిరుగు ప్రయాణంలో విజయవాడలో బాధితులకి అప్పగించడం జరిగిందని నిర్మల్ డిఎం పండరి తెలిపారు.