calender_icon.png 14 November, 2025 | 1:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆరోగ్యశ్రీ నిధుల దుర్వినియోగం!

14-11-2025 12:33:09 AM

-ఎంజీఎంలో విజిలెన్స్ దాడులు

-2021 నుంచి 2024 వరకు జరిగిన ఆపరేషన్ల రికార్డుల తనిఖీలు

వరంగల్/హన్మకొండ, నవంబర్ 13 (విజయక్రాంతి): వరంగల్ ఎంజీఎం ఆసు పత్రి లో ఆరోగ్యశ్రీ నిధులు దుర్వినియోగం అవుతున్నాయన్న ఆరోపణలపై విజిలెన్స్ డీఎస్పీ నారాయణరెడ్డి ఆధ్వర్యంలో గురువా రం తనిఖీలు నిర్వహించారు. ప్రత్యేక బృందం ఎంజీఎం ఆస్పత్రికి చేరుకొని 2021 నుంచి 2024 వరకు ఆరోగ్యశ్రీ ద్వారా చేసిన ఆపరేషన్లు, వచ్చిన నిధుల వివరాలను రికార్డుల ఆధారంగా పరిశీలించారు.

ఈ నాలుగేళ్ల కాలంలో ఆరోగ్యశ్రీకి సంబంధించి రూ.30 కోట్లకు పైగా నిధులు ఆసుపత్రికి వచ్చాయి. ఈ నిధులను అవసరమైన పనులకు కాకు ండా అనవసరమైన పనులకు వెచ్చించినట్లు ఫిర్యాదులు వెల్లువెత్తడంతో తనిఖీలు చేపట్టారు. విజిలెన్స్ అధికారులు రెండు గంటల పాటు తనిఖీలను నిర్వహించి ఆరోగ్యశ్రీ నిధులు దుర్వినియోగం చేసినట్లు గుర్తించారు.

రికార్డులను, పత్రాలను తీసుకు వెళ్లా రు. అనంతరం ఎంజీఎం సూపరిం టెండెం ట్ డాక్టర్ హరిచంద్రారెడ్డి మాట్లాడుతూ.. నిధుల దుర్వినియోగంపై దర్యాప్తు అనంత రం పూర్తి వివరాలు తెలుస్తాయని తెలిపారు.