14-11-2025 12:31:06 AM
పటాన్ చెరు, నవంబర్ 13 :గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీ, హైదరాబాదులోని కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ నిరంజన్ అప్పస్వామి వియత్నాంలోని హోచిమిన్ నగరంలో అంతర్జాతీయ విద్యా శిక్షణ కోసం వెళ్లారు.
ఆయన ఈనెల 10 నుంచి 22 వరకు వియెన్ డాంగ్ కళాశాలలో ‘కృత్రిమ మేధస్సు (ఏఐ) బిల్డర్ బ్యూట్ క్యాంప్ చేయడం ద్వారా నేర్చుకోండి ఆలోచించడం ద్వారా నిర్మించండి అనే ఆచరణాత్మక కార్యశాలను నిర్వహిస్తున్నారు.
రెండు వారాల ఈ వర్క్ షాపులో చురుకైన అభ్యాసం ద్వారా విద్యార్థులను చైతన్యపరచడానికి, ప్రయోగాలు చేయడానికి, ఆవిష్కరణలను ప్రోత్సహించడం ద్వారా సిద్ధాంతాని (థియరీ)కి మించి నేర్చుకోవడానికి ఆయన సాయపడతున్నారు. వియత్నాంలో తాను చూసిన ఉత్సాహ వాతావరణం ఆ నమ్మకాన్ని పునరుద్ఘాటిస్తుందని డాక్టర్ నిరంజన్ వ్యాఖ్యానించారు.