14-11-2025 12:31:41 AM
-నేటి నుంచి ఈ నెల 29 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు
-జనవరి 3 నుంచి 31 వరకు పరీక్షలు
హైదరాబాద్, నవంబర్ 13 (విజయక్రాంతి):తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష ( టెట్ ) నిర్వహణకు షెడ్యూల్ విడుదలైంది. జనవరి 3 నుంచి 31వ తేదీ వరకు టెట్ పరీక్ష నిర్వహించనున్నట్లు విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. ఈ పరీక్షకు శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేయను న్నా రు.
శనివారం నుంచి నవంబర్ 29 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. ప్రతి ఏటా రెండుసార్లు టెట్ నిర్వహించాల్సి ఉండగా, ఈ ఏడాది జూన్ తొలివిడత పరీక్షలు నిర్వహించి జులైన 22న ఫలితాలు వెల్లడించిన విషయం తెలిసిందే. రెండో విడత టెట్‌కు శనివారం నుంచి దరఖాస్తుల ప్రక్రియ మొదలుకానుంది.
ఈ పరీక్షలో ఉత్తీర్ణులైన వారు మాత్రమే టీచర్ ఉద్యోగాల భర్తీకి నిర్వహించే డీఎస్సీ పరీక్షకు అర్హులు అనే విషయం తెలిసిందే. ఈ పరీక్ష విధానం మొత్తం 5 విభాగాల్లో 150 మార్కులతో ఉంటుంది. మొదటి విభాగంలో సైకాలజీ 30 మార్కులు, రెండో విభాగంలో తెలుగు 30మార్కులు, మూడవ విభాగం ఇంగ్ల్లిష్‌లో 30 మార్కులు, నాలుగో విభాగం మ్యాథ్స్ మార్కులు, ఐదో విభాగంలో సోషల్ సైన్స్, ఫిజికల్ సైన్స్, బయోలాజికల్ సైన్స్ కలిపి 30 మార్కులు ఉంటాయి. ఈ పరీక్ష ల్లో ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు 60 ( 40 శాతం) మార్కులు , బీసీ అభ్యర్థులు75 ( 50 శాతం )మార్కులు, ఓసీ అభ్యర్థులు 90 (60 శాతం ) మార్కులు సాధించాల్సి ఉంటుంది.