14-11-2025 12:30:02 AM
సిద్దిపేట కలెక్టరేట్, నవంబర్:13ఈ నెల 18 వ తేదీన సిద్దిపేట పట్టణంలోని విపంచి కళా నిలయంలో జరగనున్న యువజన ఉత్సవాల పోస్టర్లను గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవనేని రఘునందన్ రావు, జిల్లా కలెక్టర్ కే.హైమావతితో కలిసి పోస్టర్లను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్, డిఆర్డిఓ జయదేవ్ ఆర్య, జిల్లా క్రీడల మరియు యువజనాధికారి వెంకట నరసయ్య, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.