14-10-2025 12:40:03 AM
చేగుంటలో గిరిజన కళాశాల విద్యార్థుల నిరసన
చేగుంట, అక్టోబర్ 13 :ఆరు నెలలుగా గణిత లెక్చరర్ రావడం లేదని చేగుంట పట్టణ కేంద్రంలో గల గిరిజన స్పోరట్స్ గురుకుల విద్యార్థినులు సోమవారం గాంధీ చౌరస్తా వద్ద ధర్నా, నిరసన చేపట్టారు.
ఈ సందర్భంగా విద్యార్థినులు మాట్లాడుతూ జూనియర్ కళాశాల రెండో సంవత్సరం చదువుతున్న తమకు ఆరు నెలలుగా గణితం బోధించడం లేదన్నారు. భవిష్యత్తుపై భయంతో రాస్తారోకో చేస్తున్నట్లు తెలిపారు. గురుకుల పాఠశాల ఉపాధ్యాయులు గణితం బోధించేలా చర్యలు తీసుకుంటామని విద్యార్థినిలకు హామీ ఇవ్వడంతో నిరసనవిరమించారు.