calender_icon.png 14 October, 2025 | 3:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జాతీయ జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్

14-10-2025 12:37:20 AM

హైదరాబాద్,అక్టోబర్ 13(విజయక్రాం తి): భువనేశ్వర్ వేదికగా జరుగుతున్న 40వ జాతీయ జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ క్రీడాకారులు అదర గొ ట్టారు. హన్మకొండ  బీసీ గురుకుల పాఠశాల విద్యార్థి కంచు లవ్లిత్ ట్రయాథ్లాన్ ఈవెంట్‌లో జాతీయ రికార్డును బద్దలు కొట్టి బం గారు పతకం గెలుచుకున్నాడు. లక్ష్యలో పా ల్గొన్న లవ్లిత్ అద్భుత ప్రదర్శనతో 2510 పాయింట్లు సాధించి మొదటి స్థానంలో నిలిచాడు.

జాతీయస్థాయి పోటీల్లో తెలంగాణ పేరు నిలబెట్టిన కంచు లవ్లిత్న్ బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్న ప్రభాకర్, కార్యదర్శి శ్రీధర్,ఎంజేపీ కార్యదర్శి సైదులు అభినందించారు. గురుకుల పాఠశాలలో క్రీడానైపు ణ్యాన్ని గుర్తించి ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని మంత్రి పొన్నం చెప్పారు. 

మిడిల్ డిస్టెన్స్ రన్నింగ్‌లో వెంకటరామిరెడ్డికి 2 స్వర్ణాలు

40వ జాతీయ జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో మిడిల్ డిస్టెన్స్ రన్నర్ మొగలి వెంకటరామిరెడ్డి సత్తా చాటాడు. అండర్-20 విభాగంలో 1500మీ. ,800 మీ. రెండింటిలోనూ స్వర్ణపతకాలు కైవసం చేసుకున్నాడు.1500 మీ. రేసును 3 నిమిషాల 49.07 సెకన్లలో పూర్తి చేయగా...800 మీ. రేసును 1 నిమిషం 59.99 సెకన్లలో ఫిని ష్ చేశాడు.కోచ్ డా.జీవీ సుబ్బారా వు దగ్గర శిక్షణ పొందుతున్న వెంకటరామిరెడ్డి గత మూడేళ్ళుగా పలు జాతీయ స్థాయి పోటీల్లో అద్భుతంగా రాణిస్తున్నాడు. తాజా ప్రదర్శనతో అమెరికాలో జరిగే అండర్-20 వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌కు వెంకటరామిరెడ్డి అర్హత సాధించాడు.