19-12-2025 12:00:00 AM
హైదరాబాద్, డిసెంబర్ 18 (విజయక్రాంతి): హైదరాబాద్‌లోని స్టార్ హాస్పిటల్స్ సీనియర్ కన్సల్టెంట్ కార్డియోథొరాసిక్ సర్జన్ డాక్టర్ లోకేశ్వరరావు సజ్జా, ఎండీ ప్రతిష్టాత్మకమైన ఆట్స్ (ఏఏటీఎస్) మిట్రల్ కాన్‌క్లేవ్ ప్రపంచంలోనే అతిపెద్ద, సుదీర్ఘమైన రెండు దశాబ్దాల ఫాలో-అప్ అధ్యయనా ల్లో ఒకటి సమర్పించారు. కొరోనరీ ఆర్టరీ బైపాస్ గ్రాఫ్టింగ్ (సీఏబీజీ)తో పాటు మిట్రల్ వాల్వ్ రిపేర్ చేయించుకున్న రోగులపై ఈ అధ్యయనం జరిగింది.
న్యూయార్కులో డిసెంబర్ 11, 12 తేదీల్లో జరిగిన ఈ కాన్‌క్లేవ్‌కు ప్రపంచవ్యాప్తంగా 900 మందికి పైగా ప్రముఖ కార్డియాక్ సర్జన్లు, పరిశోధకులు హాజరయ్యారు. ఈ చారిత్రాత్మక అధ్యయనం ’ఇస్కీమిక్ మిట్రల్ రెగ్యుర్జిటేషన్’ ఉన్న రోగులకు ‘క్యాబ్జ్’తో పా టు చేసిన మిట్రల్ వాల్వ్ రిపేర్ పై దృష్టి సారించింది. ఈ శస్త్రచికిత్స వ్యూహం అద్భుతమైన దీర్ఘకా లిక ఫలితాలను ఇచ్చిందని, 20 ఏళ్ల తర్వాత కూడా రోగుల జీవన రేటు 80% కంటే ఎక్కువగా ఉందని ఈ విశ్లేషణ నిరూపించింది.
ఇస్కీమిక్ మిట్రల్ రెగ్యుర్జిటేషన్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న అతిపెద్ద, సుదీ ర్ఘమైన డేటాసెట్లలో ఇది ఒకటి. ఈ ఫలితాలు ప్రపం చ కార్డియాక్ సర్జికల్ విధానాలపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతాయి. బైపాస్ సర్జరీతో కలిపి మిట్రల్ వాల్వ్ రిపేర్ చేయడం అనేది అత్యంత ప్ర భావవంతమైన పద్ధతి అని ఇది పునరుద్ఘాటించింది. ఆట్స్ మిట్రల్ కాన్‌క్లేవ్.. మిట్రల్ వాల్వ్ వ్యాధి రం గంలో నిపుణులను ఒకచోట చేర్చే లక్ష్యంతో 2010 లో ఈ కాన్క్లేవ్ స్థాపించబడింది. డాక్టర్ సజ్జా చేసిన ఈ రెండు దశాబ్దాల విశ్లేషణ మిట్రల్ వాల్వ్ పరిశోధనలో ఒక మైలురాయి వంటిది.