calender_icon.png 11 August, 2025 | 2:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జిల్లా నూతన కమిటీ ఎన్నిక

10-08-2025 11:49:57 PM

మంచిర్యాల,(విజయక్రాంతి): జిల్లా కెమిస్ట్రీ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ నూతన కమిటీ ఎన్నికలను ఆది వారం జిల్లా కేంద్రంలో హై లైఫ్ ఫంక్షన్ హాల్ లో టిటిసిడిఏ పరిశీలకులు వినోద్ కుమార్, రాజేందర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడుగా మోటూరి చంద్రశేఖర్, ప్రధాన కార్యదర్శిగా తోగరి సుధాకర్, కోశాధికారిగా గుడెల్లి రాజేంద్రప్రసాద్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అనంతరం కమిటీ సభ్యులను శాలువాలతో సన్మానించారు. అనంతరం కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ పట్టణ కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా తొగరు సుధాకర్, ప్రధాన కార్యదర్శిగా మోటూరి అశోక్, కోశాధికారిగా టి చంద్రశేఖర్, గౌరవాధ్యక్షులుగా చొక్కారపు శ్రీనివాస్ లను ఎన్నుకున్నారు. ఈ ఎన్నికలలో జిల్లాలోని అన్ని మండలాల నుంచి కెమిస్ట్ సోదరులు హాజరయ్యారు.