16-10-2025 01:15:52 AM
-నేటి నుంచి ఎస్‌జిఎఫ్ క్రీడా సంబురాలు
పటాన్‌చెరు, అక్టోబర్ 15: రాష్ట్రస్థాయి క్రీడాపోటీలకు సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు వేదికగా మారింది. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్(ఎస్‌జిఎఫ్) రాష్ట్రస్థాయి వాలీబాల్,కబడ్డీ పో టీలు మూడు రోజుల పాటు జరగనున్నా యి. పటాన్‌చెరులోని మైత్రి మైదానంలో ఈ పోటీలను నిర్వహిస్తున్నారు. రాష్ట్ర వ్యా ప్తంగా 33 జిల్లాల నుండి 400కు పైగా క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొంటున్నారు. స్వతహాగా క్రీడాకారుడైన స్థానిక ఎన్నెల్యే గూ డెం మహిపాల్‌రెడ్డి స్వయంగా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
పోటీల కోసం వచ్చిన క్రీడా కారులకు సొంత నిధులతో ఉచిత వస తి, భోజనం, ట్రోఫీలు ఏర్పాటు చేశారు. ఇక్కడ మంచి ప్రతిభ కనబరిచి జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యే క్రీడాకారులకు సైతం ఆర్థిక సహకారం అందిస్తున్నారు. పటాన్‌చెరు నియోజకవర్గాన్ని క్రీడలకు కేంద్రంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో రాష్ట్రస్థాయి పోటీలకు చక్కని ఏర్పాట్లు చేసామని ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి చెప్పారు.
స్థానిక ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఎమ్మె ల్యే మహిపాల్‌రెడ్డి సహకారంతో ఈ పోటీలను విజయవంతంగా నిర్వహిస్తున్నామని స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జిల్లా కార్య దర్శి శ్రీనివాస్ చెప్పారు.