20-11-2025 12:00:00 AM
ఆయన విశ్వశాంతి, విశ్వసేవను చాటి చెప్పారు
పుట్టపర్తి రావడం ఎంతో సంతోషాన్ని కలిగించింది
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ
ఘనంగా సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాలు ప్రారంభం
పాల్గొన్న పీఎం మోదీ, ఏపీ సీఎం చంద్రబాబు
సత్యసాయి ప్రపంచానికి ప్రేమను పంచారు: ఏపీ సీఎం
సత్యసాయి బాబా స్మారకార్థం రూ.100 నాణెం, నాలుగు పోస్టర్ స్టాంప్స్ విడుదల
అమరావతి, నవంబర్ 19: ప్రేమ, శాంతితో కూడిన వసుదైక కుటుంబ భావన సత్యసాయి బాబాదని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేర్కొన్నారు. విశ్వశాంతి, విశ్వసేవ ను బాబా మనకు చాటి చెప్పారన్నారు.పుట్టపర్తికి రావడం ఎంతో సంతోషంగా ఉందని, సత్యసాయి జయంతి వేడుకల్లో పాల్గొనడం తన అదృష్టమని ప్రధాని పేర్కొన్నారు. సత్యసాయి భౌతికంగా లేకున్నా.. ఆయన ప్రేమ మనతోనే ఉందన్నా రు.
బుధవారం ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తిలో సత్యసాయిబాబా శత జయంతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ వేడుకలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హాజరు కాగా ఆయనకు ఏపీ సీఎం తదితరులతో పాటు సత్యసాయి ట్రస్ట్ నిర్వాహకులు ఘనస్వాగతం పలికారు. ఈ ఉత్సవాలకు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్, మంత్రి లోకేశ్, మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్, సినీ నటి ఐశ్వర్యరాయ్ బచ్చన్ తదితర ప్రముఖులు హాజరయ్యారు.
ఈ సందర్భం గా సత్యసాయి జీవితం, బోధనలు, సేవల స్మారకార్థంగా రూపొందించిన రూ.100 నాణేం, 4పోస్టల్ స్టాంప్స్‌ను ప్రధాన మంత్రి ఆవిష్కరించారు. అనంతరం ప్రధాని ప్రసంగిస్తూ సత్యసాయి బోధనలు ఎంతోమందికి మార్గం చూపాయని కొనియాడారు.ప్రేమ, శాంతితో కూడిన వసుదైక కుటుంబ భావన సత్యసాయిదని తెలిపారు. విశ్వశాంతి, విశ్వసేవను బాబా మనకు చాటిచెప్పారని అన్నా రు.
మానవ జీవితంలో సేవ చాలా ముఖ్యమని సత్యసాయి చెప్పారని గుర్తుచేశారు. అందరినీ ప్రేమించాలి.. అందరికీ సేవ చేయాలి.. ఇదే బాబా నినాదమని వివరించారు. బాబా బోధనలు లక్షల మందికి మా ర్గం చూపాయన్నారు. అందరినీ ప్రేమించు.. అందరినీ సేవించు.. ఇదే సత్యసాయి నినా దం అని అన్నారు. విశ్వప్రేమకు ప్రతిరూపంగా సత్యసాయి జీవించారని, భౌతికంగా బాబా లేకున్నా.. ఆయన ప్రేమ మనతో నిం డి ఉందన్నారు.
గుజరాత్ భూకంపం వచ్చినప్పుడు బాబా సేవాదళ్ సేవలందించిందని గుర్తుచేశారు. పేదలకు ఎప్పుడు ఆపద వచ్చి నా.. బాబా సేవాదళ్ ఆదుకుంటుందని ప్ర శంసించారు. తాగునీరు, వైద్యం, విద్య వంటి రంగాల్లో విశిష్ట సేవలందించారని పేర్కొన్నారు. కాగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సాయి కుల్వంత్ హాల్‌లోని సత్యసాయి మ హా సమాధిని దర్శించుకున్నారు.
సత్యసాయి శత జయంత్యుత్సవాల్లో పాల్గొన్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాట్లాడుతూ సత్యసాయి అంటే ఆధ్యాత్మిక తేజస్సు, విశ్వప్రేమ అని కొనియాడారు. సత్యసాయి బాబా గొప్పతనం దేశ ప్రజలతో పాటు విదేశస్థులకు బాగా తెలుసన్నారు. మంత్రి లోకేశ్ మాట్లాడుతూ సత్యసాయి బాబా బాటలోనే అందరం నడుద్దామన్నారు. మనుషుల్లో ప్రేమ ఉన్నంత వరకు సత్యసాయి బాబా మన మధ్యే ఉంటారన్నారు. ఇక్కడకు వచ్చినప్పుడల్లా బంగారు అని బాబా పిలిచినట్లుగా అనిపిస్తుందని తెలిపారు.
సత్యసాయి బాబా ప్రేమను పంచారు: ఏపీ సీఎం చంద్రబాబు
శ్రీ సత్యసాయి బాబా శత జయంతి వేడుకల్లో సీఎం చంద్రబాబు పాల్గొని ప్రసంగించారు. సత్యసాయి బాబా తన ప్రేమను ప్రపంచమంతా పంచారని, నాస్తికులను కూడా ఆధ్యాత్మికత వైపు నడిపించారన్నారు. మానవ సేవే మాధవ సేవ అని సత్యసాయి బాబా నమ్మారని తెలిపారు.
విశ్వశాంతి, సర్వమానవ సంక్షేమమే సత్యసాయి బాబా మార్గమని అన్నారు. భూమిపై మనకు తెలిసిన, మనం చూసిన దైవ స్వరూపం సత్యసాయి బాబా అని పేర్కొన్నారు. మానవసేవే మాధవసేవ అని సత్యసాయి నమ్మ ఆచరించారని, ప్రేమను ప్రపంచమంతా పంచారని అన్నారు. ఆయన ప్రేమ సిద్ధాంతాన్ని మనమంతా అర్ధం చేసుకోవాలి, ఆయన మార్గంలో ముందుకెళ్లాలి అని చంద్రబాబు తెలిపారు.
సేవ చేయడమే సత్యసాయిబాబా లక్ష్యం: సచిన్
ప్రజలకు సేవ చేవడమే సత్యసాయి లక్ష్యంగా పెట్టుకునేవారని మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ పేర్కొన్నారు. పుట్టపర్తిలో నిర్వహించిన సత్యసాయి శత జయంత్యుత్సవాలకు సచిన్ హాజరై మాట్లాడారు. సత్యసాయి ప్రజలకు ఆరోగ్యకరమైన జీవనం అందించేందుకు పాటుపడ్డారన్నారు. బలహీన వర్గాలకు సాయం చేయడమే నిజమైన గెలుపు.. సత్యసాయిని కలిసిన ఎవరికైనా ఈ విషయం అర్ధమయ్యేది అన్నారు.
2011 వరల్డ్ కప్‌లో నేను ఆడినప్పుడు భావోద్వేగాలు అధికంగా ఉండేవి.. అప్పుడు బెంగళూరులో ఉన్నాం.. సత్యసాయిబాబా ఫోన్ చేశారు. అనంతరం ఒక పుస్తకాన్ని పంపారన్నారు. అది నాకు సానుకూల దృక్పథాన్ని, స్ఫూర్తిని ఇచ్చింది. మేం ఆ సంవత్సరం ట్రోఫీ కూడా గెలుచుకున్నాం. అది నాకు గోల్డెన్ మూమెంట్ అని సచిన్ తెలిపారు. ప్రజల్ని జడ్జ్ చేయొద్దని, వారిని అర్ధం చేసుకోవాలి సత్యసాయి చెప్పేవారని, దీనివల్ల చాలా సమస్యలు తొలగిపోతాయన్నారు.
సత్యసాయిది ప్రేమ మతం: ఐశ్వర్యరాయ్ బచ్చన్
సత్యసాయి బాబా చెప్పిన మాటలు తాను ఎప్పటికీ మర్చిపోలేనని ప్రముఖ నటి ఐశ్వర్యరాయ్ బచ్చన్ వ్యాఖ్యానించారు. సత్యసాయి బాబా సూచించిన ఐదు విధానాలను తాను ఇప్పటికీ పాటిస్తానని పేర్కొన్నా రు.‘సత్యసాయి బాబాది ప్రేమ మతం, మానవతా జాతి. మానవత్వమే జాతి, ప్రేమే మ తం, హృదయమే బాష, దేవుడు సర్వవ్యాప్తుడు.. అని బాబావారు ఎప్పుడూ చెబుతుండేవారు.
సత్యసాయి జన్మిం చి వందేళ్లు గడిచిపోయాయని.. బాబా మనతో లేక పోయినా లక్షలాది మంది గుండె ల్లో చిరస్థాయిగా నిలిచిపోతారన్నారు. ప్రజలు ఐక్యతతో కలసి మెలసి ఉండాలని సత్యసాయి బాబా ఎప్పుడూ చెప్పేవారని.. ఈ విధానాన్ని అందరూ పాటించాలి’ అని ఐశ్వర్యరాయ్ బచ్చన్ సూచించారు.