13-10-2025 12:00:00 AM
వేములవాడ టౌన్, అక్టోబర్ 12 (విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం కు విచ్చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి ఓ.ఎస్.డీ వేముల శ్రీనివాస్ రాజన్నను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ముందస్తుగా ఆలయానికి చేరుకున్న ఆయనకు ఆలయ అర్చకులు, వేద పండితులు స్వస్తి: వాచనంతో స్వాగతం పలికారు. తదుపరి దర్శనం అనంతరం మండపంలో అర్చకులు ఆశీర్వచనం అందజేశారు.ప్రధాన ఆలయ ఏ.ఈ.ఓ బి.శ్రీనివాస్, వేముల శ్రీనివాస్. శేష వస్త్రం కప్పి, లడ్డు ప్రసాదాన్ని అందజేశారు.