calender_icon.png 22 September, 2025 | 10:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విజయక్రాంతి ఎఫెక్ట్...

22-09-2025 08:41:05 PM

స్పందించిన ఎన్ఎంసీ కమిషనర్ సాబెర్ అలీ

జీపీఆర్ లేఔట్ లో అక్రమ నిర్మాణాన్ని కూల్చివేసిన మున్సిపల్ అధికారులు

కుత్బుల్లాపూర్,(విజయక్రాంతి): నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ జీపీఆర్ లేఔట్ లో జీరో పర్మిషన్ తో నిర్మిస్తున్న అక్రమ నిర్మాణాన్ని మున్సిపల్ అధికారులు సోమవారం కూల్చివేశారు. గురువారం విజయక్రాంతి దినపత్రికలో 'అక్రమ నిర్మాణాల జోరు' అనే శీర్షికతో వెలువడిన కథనానికి ఎన్ఎంసీ కమిషనర్ సాబెర్ అలీ స్పందించారు. కమిషనర్ ఆదేశాల మేరకు సోమవారం మున్సిపల్ సిబ్బంది స్లాబులను కూల్చివేశారు. మిగతా అక్రమ నిర్మాణాలకు నోటీసులు ఇచ్చామని, నోటీసుల సమయం పూర్తయ్యాక వాటిని కూడా కూల్చివేస్తామని కమిషనర్ సాబెర్ అలీ తెలిపారు.