calender_icon.png 22 September, 2025 | 10:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పారదర్శకంగా ఇందిరమ్మ ఇండ్ల మంజూరు: ఎమ్మెల్యే మురళి నాయక్

22-09-2025 08:49:30 PM

మహబూబాబాద్,(విజయక్రాంతి): నిలువ నీడలేని పేదవారికి గూడు కల్పించేందుకు కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్ల మంజూరు మొదలుకొని నిర్మాణం, బిల్లుల చెల్లింపులో ఎక్కడ కూడా ఎలాంటి అవకతవకలకు చోటు లేకుండా, పారదర్శకంగా వ్యవహరించాలని అధికారులను మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్యా మురళి నాయక్ ఆదేశించారు. సోమవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కేసముద్రం పట్టణ మున్సిపల్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల వివరాలు, బిల్లుల చెల్లింపు, మంజూరు తదితర అంశాలపై సమీక్షించారు. ఆధార్ మిస్ మ్యాచ్, బ్యాంక్ అకౌంట్, రేషన్ కార్డు వెరిఫికేషన్ లాంటి సమస్యలు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకోవాలని , ఎక్కడైనా నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.