22-09-2025 08:44:15 PM
రామచంద్రపురం: సంగారెడ్డి జిల్లా పటాన్చెరు బీఆర్ఎస్ పార్టీ సర్కిల్ అధ్యక్షుడు పరమేష్ యాదవ్ జన్మదినాన్ని పురస్కరించుకుని రామచంద్రపురం సండే మార్కెట్లో ఉచిత వైద్య శిబిరం, రక్తదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి హాజరై శిబిరాన్ని ప్రారంభించారు. మాజీ కార్పొరేటర్ తొంట అంజయ్య మాట్లాడుతూ... “పార్టీకి అతీతంగా ప్రజలందరూ ఈ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెన్నో జరగాలని మా ఆకాంక్ష” అన్నారు.