calender_icon.png 1 November, 2025 | 5:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ విద్యాసంస్థల్లో పిల్లలకు మెరుగైన విద్యను అందించాలి

31-10-2025 10:23:33 PM

నిర్మల్: ప్రభుత్వ విద్యాసంస్థల్లో పిల్లలకు మెరుగైన విద్యను అందించాలని విద్యాశాఖ సెక్రటరీ యోగితా రానా అన్నారు. శుక్రవారం రాత్రి విద్యాశాఖ సెక్రటరీ యోగితా రానా, అన్ని జిల్లాల కలెక్టర్లతో విద్యాశాఖకు సంబంధించిన పలు అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులందరికీ మెరుగైన విద్యను అందించాలని తెలిపారు. ప్రతీ రోజు పాఠశాలలు, జూనియర్ కళాశాలల విద్యార్థుల, ఉపాధ్యాయుల హాజరు శాతం సంపూర్ణంగా ఉండేలా చూడాలన్నారు. ఫేస్ రికగ్నైజింగ్ హాజరు అన్ని పాఠశాలల్లో అమలు కావాలన్నారు.

కలెక్టర్లు ఎప్పటికప్పుడు ప్రభుత్వ పాఠశాలలను తనిఖీ చేస్తూ, విద్యార్థులకు అందుతున్న విద్య, సౌకర్యాలు పర్యవేక్షించాలని అన్నారు. అన్ని అవసరమైన పాఠశాలల్లో ఎంజిఎన్ఆర్ఈజిఎస్ నిధుల ద్వారా మౌళిక సదుపాయాలు కల్పించాలన్నారు. జీరో ఎన్రోల్మెంట్ పాఠశాలలపై దృష్టి సారించాలని పేర్కొన్నారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ మాట్లాడుతూ, జిల్లాలో ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదివే విద్యార్థులందరికీ మెరుగైన విద్యను అందించేందుకు అధికారులు నిరంతరం కృషి చేయాలని అన్నారు. ప్రతీ ఒక్క అంశాన్ని నివేదికల రూపంలో ఎప్పటికప్పుడు అందజేస్తూ ఉండాలని అన్నారు. అధికారులు ప్రతీ రోజూ విద్యాశాఖపై సమీక్షిస్తూ ఉండాలని తెలిపారు.