31-10-2025 10:25:36 PM
సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సరెడ్డి పుల్లారెడ్డి
వాడ వాడల ఘనంగా వ్యవస్థాపక దినోత్సవం
మణుగూరు,(విజయక్రాంతి): పట్టణంలో ఏఐటీయూసీ ఆధ్వర్యం లో 106వ వ్యవస్థాపక దినోత్సవాన్ని శుక్రవారం వాడ వాడలో ఘనంగా నిర్వహించారు. బొగ్గుముఠా కార్యాలయం నందు ఏఐటీయూసీ జెండాను సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు సరెడ్డి పుల్లారెడ్డి ఎగురవేశారు. గుమస్తా సంఘం దగ్గర సంఘం కార్యదర్శి గడ్డం వెంకటేశ్వర్లు ఎగురవేశారు. ఆటో యూనియన్ సురక్ష అడ్డ దగ్గర గౌరవ అధ్యక్షులు వీరచారి జెండాను ఆవిష్కరణ చేశారు.
డిపో వద్ద రాయల బిక్షం ఎగురవేయగా పార్టీ రాష్ట్ర సమితి సభ్యులు సరెడ్డి పుల్లారెడ్డి హాజరై మాట్లాడారు. నేడు దేశ వ్యాప్తంగా ఏఐటియుసి కార్మిక సంఘాలు ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటారని పేర్కొన్నారు. ఏఐటీయూసీ 105 సంవత్సరాల క్రితం ఏర్పడిందని, కార్మిక హక్కుల కోసం అనేక పోరాటాలు నిర్వహించి, అనేక హక్కులకు సాధించిందన్నారు. సుదీర్ఘ పోరాటాల చరిత్ర కలిగిన సంఘం లో పనిచేయటం గర్వకారణమన్నారు. మహిళా సమైక్య జిల్లా కార్యదర్శి మున్నా లక్ష్మీకుమారి జక్కుల రాజబాబు, సొందే కుటుంబ రా వు,భిక్షం, సీతారాములు, రమేష్ పాల్గొన్నారు.