calender_icon.png 12 October, 2025 | 4:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చైనాదే మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్ స్వర్ణం

12-10-2025 01:05:43 AM

భారత్, జపాన్‌లకు కాంస్యాలు

గుహావటి, అక్టోబర్ 11: బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ జూనియర్ చాంపియన్‌షిప్‌లో మిక్సి డ్ టీమ్ ఈవెంట్ స్వర్ణపతకాన్ని చైనా కైవ సం చేసుకుంది. బ్యాడ్మింటన్‌లో తమ ఆధిపత్యా న్ని కొనసాగిస్తూ 15వ సారి విజేతగా నిలిచిం ది. ఫైనల్లో చైనా 2 సెట్ల తేడాతో ఇండోనేషియాను ఓడించింది. ఇండోనేషియా గట్టిపో టీనే ఇచ్చినప్పటకీ 30 44 స్కోర్ తో పరాజయం పాలైంది.

ఆసియా జూనియ ర్ చాంపియన్‌షిప్ విజేతలతో బలమైన జట్టునే బరిలోకి దింపిన చైనాను అడ్డుకోలేకపోయిన డిఫెండింగ్ చాంపియన్ ఇండోనే షియా రజతంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

అటు సెమీఫైనల్స్‌లో పరాజయం పాలైన భారత్,జపాన్ జట్లు కాంస్యం పతకాలు అందుకున్నాయి. మిక్సిడ్ టీమ్ విభాగంలో భారత్‌కు పతకం రావడం ఇదే తొలిసారి. కాగా సోమవారం నుంచి వ్యక్తిగత విభాగాల్లో పోటీలు మొదలుకానున్నాయి.