calender_icon.png 12 October, 2025 | 4:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సౌతాఫ్రికాకు నమీబియా బిగ్ షాక్

12-10-2025 01:04:37 AM

విండ్హోక్, అక్టోబర్ 11: ప్రపంచ క్రికెట్‌లో సంచలనం నమోదైంది. ఇటీవల నేపాల్, విండీస్‌పై టీ20 సిరీస్ గెలిస్తే.. తాజాగా దక్షిణాఫ్రికాకు పసికూన నమీబియా షాకిచ్చిం ది. సొంతగడ్డపై సఫారీలతో జరిగిన ఏకైక టీ ట్వంటీలో నమీబియా 4 వికెట్ల తేడాతో సంచలన విజయం సాధించింది. ఒక అసోసియేట్ దేశం చేతిలో ఓడిపోవడం సౌతాఫ్రి కాకు ఇది రెండోసారి.

మొదట బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 134 పరుగులకే పరిమితమైంది. డికాక్,హెండ్రిక్స్ నిరాశపరిస్తే.. స్మిత్(31) ఒక్కడే రాణించాడు. ఛేజింగ్‌లో నమీబియా ఆఖరి బంతికి విజయాన్ని అందుకుంది.చివరి ఓవర్లో విజయం కోసం 11 రన్స్ చేయాల్సి ఉండగా...జేన్ గ్రీన్ అద్భుత బ్యాటింగ్‌తో జట్టును గెలిపించాడు. ఐసీసీ పూర్తిస్థాయి సభ్యత్వం ఉన్న జట్టుపై నమీబియా గెలవడం ఇది నాలుగోసారి.