calender_icon.png 18 October, 2025 | 2:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాష్ట్ర బంద్ కు ఆర్పీఐ(ఎ) సంపూర్ణ మద్దతు

17-10-2025 10:07:31 PM

మందమర్రి,(విజయక్రాంతి): బీసీ రిజర్వేషన్ లు 42% అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీసి సంఘాలు ఇచ్చిన రాష్ట్ర వ్యాప్త బంద్ పిలుపుకు రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియ (ఆర్పిఐఎ) సంపూర్ణ మద్దతు తెలుపుతుందని, బంద్ లో అన్ని వర్గాల ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని (ఆర్పిఐఎ) రాష్ట్ర ఉపాధ్యక్షులు తుంగపిండి రమేష్ కోరారు. పట్టణంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం, ఇంటింటి సర్వే ద్వారా కులగణన చేపట్టి సర్వే ఆధారంగా బీసీలకు రావలసిన రిజర్వేషన్లు  అమలు చేయడంలో  ప్రభుత్వం పూర్తిగా విఫలం అయిందన్నారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు, వారి ఉనికిని చాటుకోవడానికి బీసీలను అడ్డుపెట్టుకొని రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు.  బీసీ రిజర్వేషన్లు అమలు అయ్యే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్త బంద్ లో పట్టణ ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.