23-04-2025 01:58:11 PM
చిట్యాల,(విజయక్రాంతి): చిట్యాల సర్కిల్ పరిధిలో సర్కిల్ ఇన్స్పెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న దగ్గు మల్లేష్ యాదవ్(Chityala CI Mallesh Yadav) ఉత్తమ అధికారిగా ప్రశంసాపత్రాన్ని అందుకున్నారు.ఇటీవలే గంజాయి,గుట్కా తదితర మాదక ద్రవ్యాలను అరికట్టడంలో సీఐ కీలక పాత్ర పోషించారు.ఈ మేరకు హైదరాబాద్ నగరంలోని ఓ వేదికలో అంటీ నార్కోటిక్స్ బ్యూరో డైరెక్టర్ సందీప్ శాండిల్య చేతుల మీదుగా ఉత్తమ అధికారిగా ప్రశంసాపత్రం అందుకున్నారు.ఇటీవలే గంజాయి ముఠాలను చాకచక్యంగా పోలీస్ సిబ్బందితో పట్టుకొని కేసులు నమోదు చేశారు.