calender_icon.png 3 May, 2025 | 9:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొండా ప్రశాంత్ రెడ్డి హత్యయత్నం కుట్ర భగ్నం

23-04-2025 02:07:20 PM

ఇద్దరి నిందితుల రిమాండ్, మిగతా నిందితుల కోసం గాలింపు 

హత్య హితం కేసు వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ డి జానకి 

మహబూబ్ నగర్, (విజయక్రాంతి): కొండ ప్రశాంత్ రెడ్డి(Konda Prashanth Reddy)పై హత్యాయత్నానికి చేసిన కుట్రను భగ్నం చేసినట్లు జిల్లా ఎస్పీడీ జానకి అన్నారు. బుధవారం భూత్పూర్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో జిల్లా ఎస్పీ డి జానకి మాట్లాడారు. ఈనెల 20వ తేదీన కొండ ప్రశాంత్ రెడ్డి తనపై హత్య ప్రయత్నం చేసేందుకు కొందరు కుట్ర పన్నుతున్నారని దేవరకద్ర పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగిందని ఎస్పీ తెలిపారు.  ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు వేగవంతంగా చేయడం జరిగిందని తెలిపారు.

ఏ వన్ గా కాట్రవత్ రూఫ్ సింగ్ నాయక్ పట్టణంలోని తిమ్మసన్ పల్లి ప్రాంతానికి చెందిన వ్యక్తి కాగా, ఎ-2 గా దేవరకద్ర కు చెందిన అరుణాచలం నవీన్ కుమార్ ప్లాను అరెస్టు చేసినట్లు తెలిపారు. సఫారీ హత్య యత్నం కేసులో క్లూస్ టీమ్ ద్వారా ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకొని రిమాండ్ కు పంపించడం జరిగిందని పేర్కొన్నారు. ఎ-3 గా శ్రీకాంత్ కర్ణాటక రాష్ట్రానికి చెందిన వ్యక్తి ఇతను పరారీ లో ఉన్నట్లు ఎస్పీ తెలిపారు. ఎ-4 రాఘవేంద్ర రెడ్డి చిన్న, ఎ-5 శ్రీకాంత్ యాదవ్ విచారణలో ఉన్నారని పేర్కొన్నారు. 2015లో పిర్యాదుదారుడు కొండా ప్రశాంత్ రెడ్డి, నవీన్ కుమార్ తండ్రి అరుణాచలం రాజును హత్య చేసినట్లు సమాచారం.ఆ కక్షతో నవీన్ కుమార్, రూప్ సింగ్ నాయక్ కు రూ.1,00,000 సుపారీ ఇచ్చి, కొండా ప్రశాంత్ రెడ్డిని హత్య చేయాలని పక్క ప్రణాళికను రూపొందించుకున్నారు.

ఇటుక డబ్బుల విషయమై రూప్ సింగ్ తన తండ్రి వద్ద పెట్టిన డబ్బులు తిరిగి అడిగిన నేపథ్యంలో బెదిరింపులు పాల్పడడం జరిగింది.  అందులో భాగంగా నవీన్ కుమార్‌తో కలిసి హత్య ప్లాన్ వేశారు. పథకం ప్రకారం, A1 గా ఉన్న రూప్ సింగ్ తన మిత్రుడు A3 శ్రీకాంత్ (కర్ణాటక)తో కలిసి రెండు నెలలుగా పిర్యాదుదారుని తరచూ గమనిస్తూ, సరైన సమయానికి వేచి చూశారు. ఈ విషయం పిర్యాదుదారుడికి తెలిసి, అజ్ఞాతంగా ఫోన్ సంభాషణ రికార్డ్ చేయబడి పోలీసులకు అందించారు. విచారణలో A1,  A2లు నేరాన్ని ఒప్పుకున్నారు. వీరిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపించబడినారు. మిగతా నిందితుల కోసం గాలింపు కొనసాగుతోంది. పూర్తి విచారణ అనంతరం తగిన చర్యలు తీసుకోబడతాయి అని వివరించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ వెంకటేశ్వర్లు, భూత్పూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రామకృష్ణ, ఎస్‌ఐ నాగన్న, సబ్-ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్,  పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.