calender_icon.png 26 December, 2025 | 6:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆనందోత్సాహాల నడుమ క్రిస్మస్ వేడుకలు

26-12-2025 12:00:00 AM

  1. ఏసును స్తుతిస్తూ ప్రత్యేక ప్రార్థనలు
  2. వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యేలు, మాజీ మంత్రి

ఆదిలాబాద్, డిసెంబర్ 25 (విజయక్రాంతి): ఏసుక్రీస్తు జననాన్ని పురస్కరించు కుని క్రైస్తవులు ప్రీతీ పాత్రంగా భావించే క్రిస్మస్ పండుగను జిల్లా వ్యాప్తంగా ఘనం గా జరుపుకున్నారు. ఆదిలాబాద్ జిల్లా కేం ద్రంలో పాటు పలు పట్టణంలోని ప్రధాన చర్చి లలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తూ పండగను భక్తి శ్రద్ధల నడుమ జరుపుకున్నారు. గురువారం ఉదయం నుండే క్రైస్తవులు ప్రార్థన మందిరాలకు చేరుకొని ప్రత్యేక ప్రార్థనలు చేసి ఒకరినొకరు పండగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఏసు క్రీస్తు జన్మ వృత్తాంతాన్ని కళ్ళకు కట్టినట్లు చూపే విధంగా ఏర్పాటు చేసిన పశువుల పాకలు, క్రిస్మస్ ట్రీ ల సెట్టింగ్ లు ఎంతగానో ఆకట్టుకున్నాయి. చర్చి ఫాదర్ ల నేతృత్వంలో ప్రత్యేక ప్రార్థనలు చేస్తూ యేసును వేడుకున్నారు.

క్రిస్మస్ పండగ సందర్భంగా ప్రార్థన మందిరాలను విద్యుత్ కాంతులతో మిరుమిట్లు కొలిపెలా అందంగా అలంకరించారు. బుధవారం రాత్రి ఫాదర్ లు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన అనంతరం భక్తి గీతాలను ఆలపిస్తూ పండగ వేడుకలను ఆనందోత్సాహాల నడుమ జరుపుకున్నారు. దీంతో చర్చ్ ప్రాంగణల వద్ద సందడి వాతావరనం నెలకొంది. నేరడిగొండలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పాల్గొన్నారు.

చిన్నారులతో కలిసి కేక్ కట్ చేసి వేడుకలను ఆనందోత్సాల మధ్య జరుపుకున్నారు. ఇంద్రవెల్లి మండల కేంద్రంలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో ఖానాపూర్ ఎమ్మెల్యే వేడ్మ బొజ్జు పటేల్ పాల్గొన్నారు. క్రైస్తవులతో కలిసి కేక్ కట్ చేసి, పండగ శుభాకాంక్షలు తెలియజేశారు. అదేవిధంగా మాజీ మంత్రి జోగు రామన్న పట్టణంలోని పలు చర్చ్ లను సందర్శించారు.క్రిస్మస్ వేడుకల్లో కేక్ కట్ చేసి క్రైస్తవులతో కలిసి పండగ వేడుకల్లో పాల్గొన్నారు.