calender_icon.png 26 December, 2025 | 5:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జిల్లాలో కాంగ్రెస్ బలోపేతమే లక్ష్యం

26-12-2025 12:00:00 AM

  1. డీసీసీ అధ్యక్షుడు నరేష్ జాదవ్

తెలంగాణ ఏర్పడ్డాక జిల్లాలో తొలిసారి డీసీసీ కార్యాలయం ప్రారంభం

ఆదిలాబాద్, డిసెంబర్ 25 (విజయక్రాంతి): ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయం ను ఎట్టకేలకు పార్టీ శ్రేణులు ప్రారంభించారు. గత కొన్నాళ్లుగా పార్టీ నేతల ఇండ్లే డీసీసీ కార్యాలయాలు కొనసాగిన తరుణంలో ఇటీవల నూతన డీసీసీ అధ్యక్షుడిగా నియమితులైన డాక్టర్ నరేష్ జాదవ్ లో నూతన డీసీసీ కార్యాలయాన్ని ఆదిలాబాద్ లో ఏర్పాటు చేశారు.

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక జిల్లాలో తొలిసారిగా డీసీసీ కార్యాలయాన్ని నెలకొల్పారు. ఈ సందర్భంగా గురువారం ఖానాపూర్ ఎమ్మెల్యే వెడమ బొజ్జు పటేల్, ఇతర పార్టీ శ్రేణులతో కలిసి డీసీసీ అధ్యక్షుడు నూతన కార్యాలయాన్ని లాంచనంగా ప్రారంభించారు. ముందుగా మహాత్మా గాంధీ, అంబేద్కర్ చిత్ర పటాలకు పూజలు చేసిన, పార్టీ జెండాను ఆవిష్కరించి, వందేమాతర గేయాన్ని ఆలపించారు.

అంతరం నూతన అధ్యక్షుడు నరేష్ యాదవ్ తన అధ్యక్ష పదవిని అలంకరించారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులనుద్దేశించి డీసీసీ అధ్యక్షుడు మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసే దిశగా ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలనీ పిలుపునిచ్చారు. అంతర్గత విభేదాలకు తావివ్వకుండా పార్టీ బలోపేతం దిశగా ముందుకు సాగాలన్నారు. ప్రతి కార్యకర్తకు అన్ని విధాలా అండగా ఉంటూ సమస్యలను తెలుసుకుంటామని స్పష్టం చేశారు.

సర్పంచ్ ఎన్నికల్లో కనబరిచిన దూకుడును రానున్న ఎన్నికల్లోనూ చూపాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ సోయం బాపూరావు, గ్రంథాలయ చైర్మన్ మల్లెపూల నర్సయ్య, నాయకులు ఆడే గజేందర్, గండ్రత్ సుజాత, అడ్డి భోజారెడ్డి, దామోదర్ రెడ్డి, సాజిద్ ఖాన్, బోరంచు శ్రీకాంత్ రెడ్డి, సంజీవ్ రెడ్డి,గణేష్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.