24-12-2025 02:25:34 AM
కాంగ్రెస్ సీనియర్ నేత మురళీధర్‌రెడ్డి
హైదరాబాద్, డిసెంబర్ 23 (విజయక్రాంతి): మాజీ ప్రధాని పీవీ నరసింహారావు బహుముఖ ప్రజ్ఞాశాలి అని కాంగ్రెస్ సీనియర్ నాయకులు కే మురళీధర్‌రెడ్డి అన్నా రు. పీవీ వర్ధంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించారు. ఆర్థిక సంస్కరణల దిశగా దేశాన్ని నడిపించిన దూరదృష్టి కలిగిన నేత పీవీ అని, క్లిష్ట పరిస్థితుల్లో దేశాన్ని స్థిరత్వం వైపు తీసుకువెళ్లి, స్వేచ్ఛాయుత ఆర్థిక విధానాలకు బలమైన పునాది వేశారని గుర్తుచేశారు.
బహు భాషావేత్తగా, పండి తుడి గా, రచయితగా అనేక రంగాల్లో భారత మేధస్సు కు ప్రతీకగా నిలిచారని అన్నారు. పీవీ ఆలోచనలు, ఆదర్శాలు మనందరికీ మార్గదర్శకంగా నిలవాలని మురళీ ధర్‌రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రాన్ని ప్రగతి పధంలో నడిపిస్తూ పేద ప్రజల మన్ననలు పొందుతున్న సీఎం రేవంత్‌రెడ్డికి అభినందనలు తెలిపారు.