29-08-2025 12:51:17 AM
ఇబ్రహీంపట్నం, ఆగస్టు 28: డిల్లీలోని సోనిపాత్లో జరుగుతున్న ఇండియా కబడ్డీ క్యాంప్ కి నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని పదర అనే మారుమూల గ్రామంలో గల ఓ నిరుపేద కుటుంబానికి చెందిన కబడ్డీ క్రీడాకారిణికి బండి నందిని సెలెక్ట్ అయ్యారు. ఆమెకు ఇబ్రహీంపట్నం సీఐ మద్ది మహేందర్ రెడ్డి చేయుత కల్పించారు. ఢిల్లీ వెళ్లేందుకు తెలంగాణ రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మద్ది మహేందర్ రెడ్డి, తన సొంత డబ్బులతో విమాన టికెట్ బుక్ చేసి, ఖర్చులకు గాను కోంత నగదు ఇచ్చి ప్రోత్సహించడం జరిగింది.
ఈ సందర్భంగా నందిని కుటుంబ సభ్యులు తెలంగాణ రాష్ట్ర కబడ్డీ సంఘం అదృష్టంగా భావిస్తున్నామనీ, మాకు గోప్ప మనుస్సు ఉన్న కార్యదర్శి మహేందర్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ దోరకడం చాలా గర్వంగా ఉందనీ వారు తెలిపారు.