calender_icon.png 29 August, 2025 | 8:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాహుల్ యాత్రకు అందరూ మద్దతు ఇవ్వాలి

29-08-2025 02:29:28 AM

  1. దొంగ ఓట్లపై బీజేపీ కుట్రలను భగ్నం చేయాలి   
  2. పీసీసీ మాజీ చీఫ్ వీహెచ్ 
  3. బీహార్ సంవిధాన్ నమ్మేళనంలో పాల్గొన్న వీ హనుమంతరావు

హైదరాబాద్, ఆగస్టు 28 (విజయక్రాంతి): మోడీ ప్రభుత్వం చేస్తున్న ఓటు చోరీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ చేపట్టిన యాత్రకు మద్దతుగా పార్టీలకు అతీతంగా ముందుకు రావాలని పీసీసీ మాజీ అధ్యక్షుడు వీ హనుమంతరావు విజ్ఞప్తి చేశారు. బీహర్‌లోని లౌతాహా మోతిహరీ మహాత్మగాంధీ ప్రేక్షక గృహంలో గురువారం జరిగిన సంవిధాన్ సమ్మేళనానికి వీహెచ్ హాజరై మాట్లాడారు.

అంతకు ముందు రాహుల్‌గాంధీతో పాటు పార్టీకి చెందిన  నాయకులతో ఆయన భాగీదారి న్యాయ్ శపథం చేయించారు. ఈ సందర్భం గా వీహెచ్ మాట్లాడుతూ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగాన్ని కాలరాసేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్రలు చేస్తోందని మండిపడ్డారు.

ఓబీసీలకు రాహుల్‌గాంధీ రిజర్వేష న్లు ఇస్తానంటుంటే.. బీసీ అని చెప్పుకునే ప్రధాని మోదీ మాత్రం బీసీలను అణదొక్కుతున్నారని విమర్శించారు. మూడుసార్లు అధికారంలోకి వచ్చిన బీజేపీ.. నాలుగోసారి దొంగ ఓట్లతో మరోసారి అధికారంలోకి వచ్చేందుకు కుట్రలు చేస్తున్నదని దుయ్యబట్టారు. రాహుల్ చేపట్టిన ధర్మ యుద్ధానికి దేశంలోని ప్రతి ఒక్కరు మద్దతు ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు.