29-08-2025 12:52:55 AM
ఘట్ కేసర్, ఆగస్టు 28 : ఘట్ కేసర్, పోచారం మున్సిపల్స్ ప్రాంతాలలో వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు బుధవారం అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. యువజన సంఘాల ఆధ్వర్యంలో వినాయక మండపాలను ఏర్పాటు విగ్నేశ్వరుని విగ్రహాలను, అలాగే ఇళ్లలోనే చిన్న మండపాలను నిర్మించి భక్తులు గణపతి విగ్రహాలను ప్రతిష్టించారు.
పోచారం మున్సిపల్ అన్నోజీగూడ లోని సూర్య యూత్ ఆధ్వర్యంలో అలాగే ఘట్ కేసర్ పట్టణంలో ఆర్కే శివాజీ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపాల వద్ద గణపతి విగ్రహ ప్రతిష్ఠాపణ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి, మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి పాల్గొని బ్రాహ్మనోత్తముల మంత్రోచరణాల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించారు.
పలు వినాయక మండపాల వద్ద రైతు సొసైటీ చైర్మన్ సింగిరెడ్డి రాంరెడ్డి, మాజీ ఎంపీపీలు బండారి శ్రీనివాస్ గౌడ్, ఏనుగు సుదర్శన్ రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ లు ముల్లి పావని జంగయ్యయాదవ్, బోయపల్లి కొండల్ రెడ్డి, మాజీ వైస్ చైర్మన్ లు పలువుల మాధవరెడ్డి, రెడ్డి అన్న, బిబ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు వేముల మహేష్ గౌడ్, బిఆర్‌ఎస్ పార్టీ పోచారం మున్సిపల్ అధ్యక్షులు మందడి సురేందర్ రెడ్డి, మున్సిపల్ కాంగ్రెస్ అధ్యక్షులు మామిళ్ళ ముత్యాల్ యాదవ్, సింగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈసందర్భంగా ఉత్సవ నిర్వాహకులు ముఖ్య అతిథులను, నాయకులను శాలువాలతో ఘనంగా సత్కరించారు.